అన్ని వసతులు ఉన్న బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని కొవిడ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల కాలంలో కిషన్‌రెడ్డి ఎయిమ్స్‌ను సందర్శించిన సందర్భంగా కొవిడ్‌పై ఏదొక నిర్ణయం తీసుకుంటారని ప్రజలంతా ఎదురు చూశారని... కాని అలాంటిదేమీ జరగలేదన్నారు. ఎయిమ్స్‌లో విశాలమైన భవనాలతో పాటు 180 మందికి పైగా వైద్యులు, సిబ్బంది ఉన్నారన్నారు. సీసీఎంబీ ఆక్సిజన్ ప్లాంట్ అనుమతిపై కూడా సానుకూలంగా ఉందన్నారు. ఇన్ని వసతులు ఉన్న ఈ వైద్యశాలను ఉపయోగించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాలని రాష్ట్ర, జిల్లా యంత్రాంగం చెబుతోందని కిషన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు.
'బీబీనగర్ ఎయిమ్స్‌ను కొవిడ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించాలి' - తెలంగాణ తాజా వార్తలు
బీబీనగర్ ఎయిమ్స్‌ను కొవిడ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించాలని కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. అన్ని సౌకర్యాలున్న ఎయిమ్స్‌ను కొవిడ్ చికిత్సకు ఉపయోగించుకోకుండా జాప్యం చేస్తే... మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్‌పై లేఖ
ఎయిమ్స్‌ను కొవిడ్ చికిత్సకు ఉపయోగించుకోకుండా జాప్యం చేస్తే మరణాలకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పది పదిహేను రోజుల్లో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు కావాల్సిన బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లను తక్షణం ఏర్పాటు చేయాలని.. అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.