తెలంగాణ

telangana

ETV Bharat / state

CPM: 'తడిసిన ధాన్యాన్ని ఎంఎస్‌పీ ధరకే కొనుగోలు చేయాలి' - ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు

కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన పంటలో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన.. ఆచరణలో అమలు కావడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యానికి డబ్బులు చెల్లించలేమని చెప్పడం దుర్మార్గమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

CPM state secretary
CPM state secretary

By

Published : Jun 4, 2021, 7:40 PM IST

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎంఎస్‌పీ (Minimum support price) ధరకే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గోనె సంచులు, ట్రాన్స్‌పోర్ట్‌ కొరతను పరిష్కరించాలన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యానికి డబ్బులు చెల్లించలేమని చెప్పడం దుర్మార్గమన్నారు.

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణలో అమలు కావడం లేదన్నారు తమ్మినేని. తడిసిన ధాన్యానికి ఇతర రాష్ట్రాల్లో నష్ట పరిహారం చెల్లిస్తున్నారని ప్రస్తావించారు. తూకం వేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండి:KCR: పర్యావరణ పరిరక్షణను మించిన సంపదే లేదు

ABOUT THE AUTHOR

...view details