నల్గొండ మహిళపై 139 మంది లైంగిక దాడికి పాల్పడిన కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా విచారించి, వాస్తవాలు వెలికితీయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని కోరింది. బాధితురాలికి భద్రతతో పాటు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
'నల్గొండ మహిళ అత్యాచార కేసులో దోషులను శిక్షించాలి' - 139 members raped a woman in nalgonda district
నల్గొండ మహిళపై 139 మంది లైంగిక దాడికి పాల్పడటాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
!['నల్గొండ మహిళ అత్యాచార కేసులో దోషులను శిక్షించాలి' cpm state committee demands to punish culprits of nalgonda woman rape case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8578943-767-8578943-1598530097272.jpg)
'నల్గొండ మహిళ అత్యాచార కేసులో దోషులను శిక్షించాలి'
చదువుకునేందుకు భాగ్యనగరానికి వచ్చి ఒంటరిగా ఉంటున్న మహిళలను భయపెట్టి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తున్నారని ఓ ప్రకటనలో మండిపడింది. కొందరి దుండగుల చేష్టలు సమాజానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయని పేర్కొంది.