ఆధార్‌తో సంబంధం లేకుండా మంచినీటిని సరఫరా చేయాలని సీపీఎం నగర కమిటీ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆధార్‌తో సంబంధం లేకుండా జలమండలి పరిధిలోని గృహ వినియోగదారులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి.. మరోవైపు ఆధార్‌ని అనుసంధానం చేయాలని షరతులు విధించడం వెనుక మతలబు ఏమిటని సీపీఎం నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ప్రశ్నించారు.
'ఆధార్‌తో సంబంధం లేకుండా మంచినీటిని సరఫరా చేయాలి'
ఆధార్ కార్డు లింక్ లేకుండా వినియోగదారులందరికీ మంచినీటి సరఫరా చేయాలని సీపీఎం నగర కమిటీ సమావేశం నిర్వహించింది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం ప్రజలకు ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేయడానికి అనేక షరతులు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని సీపీఎం నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్ అన్నారు.
Breaking News
తాగునీరు పొందుతున్న గృహ వినియోగదారులందరికీ ఆధార్ తప్పనిసరి చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వశాఖ 2019లో జారీ చేసిన ఆదేశాల అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు.
రక్షిత తాగునీరు పొందడం ప్రజల హక్కు అని పేర్కొన్నారు. తాగునీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వాల బాద్యతని తెలిపారు. కానీ ఆ బాధ్యతను విస్మరించి.. తాగునీటిని సరకుగా మార్చడం సమంజసం కాదని వెల్లడించారు.