కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి.. పేద ప్రజల రక్తాన్ని పీలుస్తోందని హైదరాబాద్‌లోని సీపీఎం నేతలు మండిపడ్డారు. ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆందోళన నిర్వహించారు.
భాజపా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచి, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేసిందని.. సీపీఎం సెంట్రల్ జోన్ కార్యదర్శి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని గుర్తు చేశారు. త్వరలోనే కేంద్రం.. ఇందన ధరలను లీటరకు రూ. 100, గ్యాస్ సిలిండర్‌ను రూ. 1000కి పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.