హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సీపీఎం నేతలు ధర్నాకు చేపట్టారు. రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో నిధులు ఇవ్వకపోవడం వల్లే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని సీపీఎం నేతలు ఆరోపించారు. ప్రతి ఏటా వెయ్యి కోట్లతో నిర్వహణ అవసరం అని.. కానీ బల్దియా పట్టించుకోకపోవడం వల్ల జనాలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
'రోడ్ల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే ఊరుకోం' - cpm protest
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. గ్రేటర్ పరిధిలో రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
!['రోడ్ల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే ఊరుకోం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5073753-thumbnail-3x2-ktr.jpg)
జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా
జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా