హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలను పరిరక్షించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆసిఫ్‌నగర్‌లోని దేవుని కుంటలో జరుగుతున్న భూ ఆక్రమణలను నిరోధించాలని సీపీఎం నాయకులు... నాంపల్లిలోని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. దేవుని కుంట ఆలయానికి అప్పట్లో 11 ఎకరాల భూమి ఉండగా... ప్రస్తుతం అది 5 ఎకరాలకు తగ్గిపోయిందని ఆరోపించారు. కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆక్రమణలకు తెగించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దేవుని కుంట భూములను కాపాడాలని సీపీఎం ధర్నా
ఆక్రమణకు గురైన దేవుని కుంట భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. నాంపల్లిలోని కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం చొరవ చూపి నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.
సీపీఎం ధర్నా