ప్రభుత్వం ప్రకటిస్తున్న కేసుల్లో వ్యత్యాసం ఉంది: సీపీఎం - సీపీఎం గ్రేటర్ సెంట్రల్ జోన్ మీడియా సమావేశం
14:39 August 26
ప్రభుత్వం ప్రకటిస్తున్న కేసుల్లో వ్యత్యాసం ఉంది: సీపీఎం
గ్రేటర్ హైదరాబాద్లో కొవిడ్ కేసులు లేవని ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని సీపీఎం గ్రేటర్ సెంట్రల్ జోన్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రోజు ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా కేసుల వివరాల్లో చాలా వ్యత్యాసం ఉందని ఆరోపించారు. గ్రేటర్లో ర్యాపిడ్ పరీక్ష కేంద్రాలు, పీసీఆర్ కేంద్రాల్లో రోజూ నమోదవుతున్న కేసుల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్లోని పార్టీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు
వచ్చే నెలలోపు నగరంలో మహమ్మారి కేసులు ఉండవని ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. నగరంలో చేపట్టిన రాపిడ్ పరీక్షల్లో చాలా వరకు నెగిటివ్ వస్తున్నాయని ఆరోపించారు. వైరస్ విషయంలో ప్రజలను మభ్యపెట్టడం సరికాదని.. వ్యాధిపై ప్రజలకు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:బతికుండగానే చంపేశారు.. ఆసుపత్రి ముందు ఆందోళన