తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాతో స్నేహం చేస్తే కేసీఆర్​కే నష్టం: సీపీఎం - cpm politburo member raghavulu fires on bjp

ఫెడరల్​ వ్యవస్థను కాపాడడంలో కేసీఆర్​ పాత్ర ఏమిటో చెప్పాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్​ చేశారు. వ్యవసాయ చట్టాలపై తెరాస ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. భాజపాతో స్నేహం కేసీఆర్​కే నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు.

'భాజపాతో స్నేహం చేస్తే కేసీఆర్​కే నష్టం'
'భాజపాతో స్నేహం చేస్తే కేసీఆర్​కే నష్టం'

By

Published : Jan 4, 2021, 7:24 PM IST

నూతన వ్యవసాయ చట్టాలను అమలుచేయకుంటే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తోందని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థని భాజపా సంఘ్‌ పరివార్‌ వ్యవస్థగా మార్చిందని రాఘవులు ధ్వజమెత్తారు.

ఫెడరల్‌ వ్యవస్థని కాపాడడానికి ప్రాంతీయ పార్టీలు ముందుకు రావాలని సీపీఎం పిలుపునిస్తుందన్నారు. ఇందులో కేసీఆర్​ పాత్రేంటో కేసీఆర్​ చెప్పాలని డిమాండ్​ చేశారు. వ్యవసాయ చట్టాలపై తెరాస ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. పంట కోనుగోలు చేసే వరకు సీపీఎం.. మిలిటెంట్‌ తరహా పోరాటం చేస్తుందన్నారు.

గ్రామ పంచాయతీలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరారు. భాజపా బలపడితే తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుందన్నారు. భాజపాను నిరోధించడం కోసం లౌకిక శక్తులు ఏకం కావాలని ఆకాంక్షించారు. భాజపాతో స్నేహం కేసీఆర్​కే నష్టమని తమ్మినేని అన్నారు.

ఇవీచూడండి:పీసీసీ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ.. ఆ 'హస్త'వాసి ఎవరిదో!

ABOUT THE AUTHOR

...view details