అమరావతి జనభేరికి సీపీఎం దూరంగా ఉంది. అమరావతి విషయంలో భాజపా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నందని, భాజపాను కూడా సభకు పిలవడంపై సీపీఎం అభ్యంతరం తెలిపింది. పరిపాలన రాజధాని అమరావతిలో ఉండాలని సీపీఎం స్పష్టం చేసింది.
అమరావతి జనభేరికి సీపీఎం గైర్హాజరు - ఏపీ తాజా వార్తలు
అమరావతి జనభేరికి సీపీఎం గైర్హాజరైంది. భాజపా నేతలతో కలిసి వేదిక పంచుకోలేమని.. ఐకాస కన్వీనర్‌కు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. అమరావతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న భాజపాను సభకు పిలవడంపై అభ్యంతరం తెలిపారు. అయితే పరిపాలన రాజధాని అమరావతిలో ఉండాలని సీపీఎం అభిప్రాయమని స్పష్టం చేశారు.
అమరావతి జనభేరికి సీపీఎం గైర్హాజరు
రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొంది. భవిష్యత్తు కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందన్న ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. భాజపా నేతలతో కలిసి వేదిక పంచుకోలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఐకాస కన్వీనర్‌కు లేఖ రాశారు.
ఇదీ చదవండి :'అమరావతిపై రెఫరెండానికి రెడీ.. ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా'