ప్రభుత్వాలు మారుతున్న పేద ప్రజల సొంతింటి కల సాకారం కావడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహ అన్నారు. దరఖాస్తు చేసుకున్న రాజీవ్ గృహకల్ప, రెండు పడక గదుల పథకం అర్హులకు ప్రభుత్వం వెంటనే ఇళ్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు.
అర్హులకు వెంటనే ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలి: సీపీఎం - సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నరసింహ ధర్నా
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల విషయంలో ప్రజల్లో లేని ఆశలు రేపి ఆరేళ్ల పాటు పబ్బం గడిపారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహ ఆరోపించారు. అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు.
అర్హులకు వెంటనే ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలి: సీపీఎం
సుదీర్ఘకాలం క్రితం రాజీవ్ గృహకల్ప ఇళ్ల కోసం వేల రూపాయలు కట్టిన పేదలు ఆ గృహాల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారని డీజీ నరసింహ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు పడక గదుల ఇళ్ల విషయంలో ప్రజల్లో లేని ఆశలు రేపి ఆరేళ్ల పాటు పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు. పేదల ఓట్లతో అధికారం చేపట్టిన కేసీఆర్ ఇకనైనా డబల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులందరికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'హోంలలోని బాలికలందరికి సుకన్య సమృద్ధి పథకం'
Last Updated : Feb 10, 2021, 8:20 PM IST