ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీపీఎం నేత బీవీ రాఘవులు తప్పుబట్టారు. ఏపీలోని ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పటం సరికాదని అభిప్రాయపడ్డారు. కార్మికులను చర్చలకు పిలవాలని, వాళ్ల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం మాట్లాడుతున్న విధానానికి పోలికే లేదని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తి లేదనడం సరికాదు: రాఘవులు - cpm leader bv raghavulu comments on RTC strike
ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చించాలని సీపీఎం నేత బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తి లేదనడం సరికాదు: రాఘవులు
ఇదీ చూడండి: కార్మికులారా.... తొందర పడకండి: జగ్గారెడ్డి