తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణకు గర్వపడే విప్లవ చరిత్ర ఉంది: సీతారాం ఏచూరి - సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

తెలంగాణకు గర్వపడే విప్లవ చరిత్ర ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ప్రస్థానంపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

cpm general secretary sitharam achuri participated online meet
తెలంగాణకు గర్వపడే విప్లవ చరిత్ర ఉంది: సీతారాం ఏచూరి

By

Published : Oct 17, 2020, 9:29 PM IST

కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ప్రస్థానంపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. తెలంగాణకు గర్వపడే విప్లవ చరిత్ర ఉందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో అందరం కలిసి ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగానికి పునాదులైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయంపై దాడులు చేస్తోందని ఆరోపించారు. హిందూత్వ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళలపై హింస, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ కేంద్రం చేతిలోనే అధికారం ఉండేలా చర్యలు తీసుకుంటున్నదని విమర్శించారు.

విద్య, వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్న నూతన విద్యావిధానం, వ్యవసాయ చట్టాలను ఏకపక్షంగా తీసుకొచ్చిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని సమస్యలు ఎదురైనా మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఓట్లు, సీట్లు తగ్గినా సైద్ధాంతిక నిబద్ధతతో ముందుకు సాగుతున్నామన్నారు.

ఇదీ చదవండి:వరదల్లో కొట్టుకెళ్లిన వాహనాలు... లక్షల్లో నష్టం

ABOUT THE AUTHOR

...view details