తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రైనేజీ లోపాల వల్లే ఉస్మానియా వార్డుల్లోకి నీరు: కోదండరాం

ఉస్మానియా ఆస్పత్రిని సీపీఐ, సీపీఎం, తెజస నేతలు సందర్శించారు. వరద నీరు చేరిన వార్డులను పరిశీలించారు. అనంతరం రోగుల సమస్యలపై ఆరా తీశారు. డ్రైనేజీ వ్యవస్థలో లోపాల వల్లే ఉస్మానియా వార్డుల్లోకి నీరు చేరిందని కోదండరాం ఆరోపించారు. ఉస్మానియా డ్రైనేజీ వ్యవస్థను వెంటనే బాగు చేయాలని డిమాండ్​ చేశారు.

ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన సీపీఐ, సీపీఎం, తెజస నేతలు
ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన సీపీఐ, సీపీఎం, తెజస నేతలు

By

Published : Jul 17, 2020, 3:48 PM IST

Updated : Jul 17, 2020, 7:36 PM IST

ప్రతిపక్ష పార్టీల వల్లే ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనాలు నిర్మించలేకపోయామన్న మంత్రుల వ్యాఖ్యలపై సీపీఐ, సీపీఎం, తెజస నేతలు మండిపడ్డారు. ఆస్పత్రి వార్డుల్లోకి వర్షపు, డ్రైనేజీ నీరు రావడానికి.. ప్రతిపక్షాలకు సంబంధమేమిటని మంత్రులను ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం సందర్శించారు. ఉస్మానియాలో వరదనీరు చేరిన వార్డులను పరిశీలించారు. అనంతరం రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

డ్రైనేజీ వ్యవస్థలో లోపాల వల్లే ఉస్మానియా వార్డుల్లోకి నీరు చేరిందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఉస్మానియా డ్రైనేజీ వ్యవస్థను వెంటనే బాగు చేయాలని డిమాండ్​ చేశారు. ఆస్పత్రికి రూ. వంద కోట్లు కేటాయించి కొత్త భవనాలు నిర్మించాలని కోదండరాం కోరారు.

"ఆస్పత్రిలోకి నీళ్లు వస్తే మేము ఎన్నడో కూల్చమన్నామని మాట్లాడుతున్నారు. ఉస్మానియా కంటే ముందు కట్టింది హైకోర్టు. దీంతోపాటు కట్టింది మొజాంజాహీ మార్కెట్​. మరి ఆ భవనాలన్నీ గట్టిగా ఉన్నాయి కదా.. పట్టించుకోక, మరమ్మతులు చేయక ఆస్పత్రి పరిస్థితి ఇలా మారింది."

-కోదండరాం, తెజస అధ్యక్షుడు

డ్రైనేజీ లోపాల వల్లే ఉస్మానియా వార్డుల్లోకి నీరు: కోదండరాం

"కేసీఆర్ సర్కారు... సచివాలయ కూల్చివేతపై ఉన్న శ్రద్ద.. ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరచడంలో లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో గాంధీ, టిమ్స్ ఆస్పత్రి ప్రాంగణాన్ని చంద్రబాబు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా సమయంలో సర్కారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

-రావుల చంద్ర శేఖర్ రెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు."

ఉస్మానియా ఆస్పత్రిలో నీరు చేరడంపై స్పందించిన రావుల

ఉస్మానియా ఆస్పత్రి ఘటనపై విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి డిమాండ్​ చేశారు. ఉస్మానియాలో కొత్త భవనాలకు వెంటనే శంకుస్థాపన చేయాలని కోరారు. ప్రాధాన్యత గల ఆస్పత్రిని సీఎం కేసీఆర్​ కావాలనే నిర్వీర్యం చేశారని జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు.

ఇవీ చూడండి:కొందరిలో కొవిడ్‌ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్‌..

Last Updated : Jul 17, 2020, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details