కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను ఇవ్వకుండా మోసం చేస్తోందని హైదరాబాద్ గోల్నాకలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించుకునే అధికారం పూర్తిగా రాష్ట్రాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చి రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని విమర్శించారు.
'కేంద్రం జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలి' - cpm protest over gst pending bills in golnaka
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ సీపీఎం ధర్నాకు దిగింది. హైదరాబాద్ గోల్నాక చౌరస్తాలో ఆందోళన చేపట్టింది.
జీఎస్టీ బకాయిలపై సీపీఎం ఆందోళన
ఆర్థిక రంగంలో నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ రాష్ట్రాలను మున్నిపాలిటీ స్థాయికి దిగజారుస్తోందన్నారు.