పెంచిన పెట్రోల్, డీజిల్, విద్యుత్ ధరలు తగ్గించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఆందోళన నిర్వహించారు. ఓ వైపు ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు.
'విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి... కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి' - Petrol Price Hikes
లాక్డౌన్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో నిరసన చేపట్టింది. ఓ వైపు ప్రజలు ఉపాధి లేక బాధపడుతుంటే.. ప్రభుత్వాలు ఇంధన ధరలు పెంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రోల్ ధరలు తగ్గించాలని న్యూడెమోక్రసీ నేతల నిరసన
పది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు పది రూపాయలకు పైగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో సతమతవుతున్న ప్రజలకు రవాణా సైకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందించాలని, విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డీమాండ్ చేశారు.
ఇవీ చూడండి:కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్