చైనాకు సంబంధించిన 59 యాప్‌లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. దేశ అంతరంగిక భద్రతకు ఏ మాత్రం విఘాతం కల్గినా మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుందన్నారు.
చైనా యాప్‌ల నిషేధాన్ని సీపీఐ స్వాగతిస్తోంది : నారాయణ ఆవేశంతో వస్తువులన్నింటినీ...
చైనా దేశం మీద ఉన్న ఆవేశంతో.. ఆ దేశ వస్తువులను అన్నింటిని బహిష్కరిస్తామనడం సబబు కాదన్నారు. ఏడున్నర లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు చైనాతో జరుగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. ఆర్థిక సంబంధమైన అంశాలపైనా నిర్ణయం తీసుకుంటారా లేక యాప్‌లకే పరిమితమవుతుందో చాడాలన్నారు.
ఇవీ చూడండి : నవంబర్ వరకు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ: మోదీ