డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో కలిసి ట్యాంక్ బండ్‌పై గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతోందని ఆరోపించారు.
రాజ్యాంగం అపహాస్యమవుతోంది: సీపీఐ - చాడ వెంకట్ రెడ్డి వార్తలు
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతోందని సీపీఐ మండిపడింది. దేశంలో మతోన్మాదంతో కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై గల అంబేడ్కర్ విగ్రహానికి ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
పేదవాడు మరింత పేదవాడుగా.. ధనవంతుడు మరింత ధనవంతుడుగా మారుతున్నారన్నారు. సేవ్ డెమోక్రసీ సేవ్ సెక్యులరిజం నినాదంతో ఉద్యామాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. భూములు, భారీ పరిశ్రమలు జాతీయం చేయాలని అంబేడ్కర్ కోరుకున్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రధాని పాలనలో అన్ని ప్రైవేటుపరం చేయటంతో అంబానీ అదానీలు లక్షల కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు తమ హక్కులను కోల్పోతున్నారని రామకృష్ణ మండిపడ్డారు.
ఇదీ చదవండి:బెల్లంపల్లిలో కరోనా బాధితురాలి బలవన్మరణం