మోదీ వల్లనే దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేయడమే ప్రధాన లక్ష్యంగా మోదీ ముందుకు వెళ్తుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. బ్యాంకింగ్ సిబ్బంది చేస్తున్న సమ్మెకు సీపీఐ మద్దతు పలికింది. దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా హైదరాబాద్ కోఠిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో చేపట్టిన ధర్నాలో చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోండి: చాడ - తెలంగాణ తాజా వార్తలు
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల బ్యాంకు ఉద్యోగులు, ప్రజలకు నష్టం వాటిల్లుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చాడ విమర్శించారు.

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి: చాడ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేస్తుంటే.. ప్రధాని మోదీ వాటిని ప్రైవేటీకరణ చేయడం దారుణమని చాడ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల బ్యాంకు ఉద్యోగులు, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ తరఫున పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి:ఎల్ఐసీ ప్రైవేటీకరణతో సంస్థ, ఉద్యోగులకు నష్టం: నామ