మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఇసుక మాఫియా దాడిని సీపీఐ తీవ్రంగా ఖండించింది. దళిత రైతు నర్సింహులును ఇసుక మాఫియానే హత్య చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. ఈ మాఫియా వెనక ఎంతపెద్ద రాజకీయ అండ ఉందో.. ఈ దాడులను బట్టే అర్థమవుతోందని మండిపడ్డారు.
ఇసుక మాఫియా వెనక ఎంత పెద్ద అండ ఉందో అర్థమవుతోంది: చాడ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తాజా వార్తలు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా దాడిలో మృతి చెందిన దళిత రైతు నర్సింహులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా వెనక ఎంతపెద్ద రాజకీయ అండ ఉందో ఈ దాడితో తెలుస్తుందని అన్నారు.
ఇసుక మాఫియా వెనక ఎంత పెద్ద అండ ఉందో అర్థమవుతోంది: చాడ
ఇసుక మాఫియా పట్ల సమగ్రమైన విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీచూడండి: రైతు మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతల అరెస్ట్