రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ప్రజలను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా విజృంభణతో హైదరాబాద్ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని తెలిపారు. రాజధానిలో కొవిడ్ పరీక్షలను మరింత పెంచాలని సూచించారు.
ఆర్థిక ప్యాకేజీతో ప్రజలను ఆదుకోవాలి: చాడ - చాడ వెంకట్‌రెడ్డి తాజా వార్తలు
కొవిడ్-19 నేపథ్యంలో రాజధాని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి.. ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్థిక ప్యాకేజీతో ప్రజలను ఆదుకోవాలి: చాడ
రాష్ట్రంలో ప్రతిపక్షాలు చెప్పినవన్నీ నిజమవుతున్నాయన్న చాడ.. గచ్చిబౌలి టిమ్స్‌ను ఎందుకు ఉపయోగించటం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. బస్తీల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీచూడండి: దుర్గం చెరువుపై తుది ఘట్టానికి చేరిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం