Kunamneni Demanded to Abolish The Governor System: దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ నెల 19న ఛలో రాజ్‌భవన్‌కు సైతం పిలుపునిచ్చారు. గవర్నర్ వ్యవస్థ అరాచకంగా మారిందని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి, ఇబ్బందులకు గురి చేయడానికి గవర్నర్ వ్యవస్థ పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 19న ఛలో రాజ్‌భవన్‌కు సీపీఐ పిలుపు - హైదరాబాద్ న్యూస్
Kunamneni Demanded to Abolish The Governor System: దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 19న ఛలో రాజ్‌భవన్‌కు సీపీఐ పిలుపునిచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. గవర్నర్ వ్యవస్థ అరాచకంగా మారిందని హైదరాబాద్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఐటీ, ఈడీ సోదాలు చేయిస్తున్నారని తెలిపారు.
Kunamneni Sambasivarao
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలతో సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థలను ప్రక్షాళన చేయాలన్నారు. షర్మిలను అరెస్టు చేస్తే గవర్నర్ స్పందించడం సంతోషమని, అందరి విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: