తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2021, 4:10 AM IST

ETV Bharat / state

విశాఖ ఉక్కుపై కేటీఆర్‌ వ్యాఖ్యలు శుభపరిణామం: చాడ

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని కేటీఆర్ వ్యతిరేకించి.. సందర్శిస్తానని ప్రకటించడం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మోదీకి గుణపాఠం చెప్పాలంటే ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తూ ఉద్యమం చేపట్టాలని పేర్కొన్నారు. విభజన హామీలపై తెరాస ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధం కావాలని డిమాండ్ చేశారు.

KTR opposes privatization of Visakhapatnam steel
'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేటీఆర్ వ్యతిరేకించడం మంచి పరిణామం'

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించడంతో పాటు సందర్శిస్తానని కేటీఆర్ ప్రకటించడం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సింగరేణి, విద్యుత్తు లాంటి లాభదాయక పరిశ్రమలపై కత్తి వేలాడుతూనే ఉందని ఆరోపించారు.

మోదీకి గుణపాఠం చెప్పాలంటే ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తూ ప్రజా ఉద్యమాన్ని చేపడితేనే వెనక్కు తగ్గుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేట్ పరం చేస్తామని పార్లమెంట్​లో ప్రధాని ప్రకటించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన హామీలపై తెరాస ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధం కావాలని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేటీఆర్ వ్యతిరేకించడం మంచి పరిణామం

ఇదీ చూడండి:గడువు దగ్గరపడుతున్నకొద్దీ జోరుగా ఎమ్మెల్సీ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details