తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్షణమే మున్సిపల్​ ఎన్నికలు వాయిదా వేయాలి: చాడ - హైదరాబాద్ తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నందున తక్షణమే మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అందరికి కొవిడ్​ పాజిటివ్‌ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్​ ఆలోచించాలన్నారు.

Chadha Venkat Reddy has demanded immediate postponement of municipal elections
మున్సిపల్​ ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన చాడా వెంకట్​ రెడ్డి

By

Published : Apr 21, 2021, 3:25 PM IST

రాష్ట్రంలో కరోనా మొదటి దశ కంటే రెండో దశలోనే మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి తెలిపారు. తక్షణమే మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్​ని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ఆలోచించాలన్నారు. సభలు, సమావేశాల ద్వారా వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న చాలా మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని గుర్తు చేశారు. వారిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం వైరస్​ సోకిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ముఖ్యమని... వారికి రక్షణ లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ అంత మంచిది కాదని చెప్పారు.

ఇదీ చదవండి: నగరంలో కరోనా పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ

ABOUT THE AUTHOR

...view details