గోదావరి జలాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. రంగనాయక సాగర్‌కు నీళ్లు రావడం శుభ పరిణామన్నారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచడం, వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. దేశంలో కరోనా కట్టడి విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.