తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : చాడ వెంకట్ రెడ్డి - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్​ చేశారు. ప్రధాని మోదీ ఉచిత బియ్యంతోపాటు ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500 ఇవ్వాలని కోరారు. కొండపోచమ్మ రిజర్వాయర్ కెనాల్​కు గండిపై విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

cpi-state-secretary-chada-venkat-reddy-said-health-emergency-should-be-announced-nationwide
దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : చాడ వెంకట్ రెడ్డి

By

Published : Jul 1, 2020, 4:21 PM IST

దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఐదు నెలల పాటు బియ్యం, పప్పు, గోధుమలు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం వల్ల ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. నిత్యావసర వస్తువులతోపాటు ప్రతి కుటుంబానికి ప్రతి నెల రూ.7 వేల 5 వందల నగదు ఇవ్వాలని కోరారు.

దేశవ్యాప్తంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని.. కరోనా కట్టడి కోసం ప్రతి రాష్ట్రానికి కేంద్రం రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది అధికార పార్టీ నేతలేనని ఆరోపించారు. ప్రతిష్ఠాత్మకమైన కొండపోచమ్మ రిజర్వాయర్ కెనాల్​కు గండి పడటమంటే ప్రభుత్వానికి మాయని మచ్చన్నారు. నాణ్యత లోపంపై విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లాక్​డౌన్ విధించాలనుకుంటే ప్రభుత్వం ప్రజలకు ముందు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లాక్​డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి :గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు... ఆందోళనలో వైద్యులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details