తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాల ఊసే లేదు: చాడ వెంకట్‌ రెడ్డి - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో అందుకు భిన్నంగా పాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించారు.

cpi chada
హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

By

Published : Jun 2, 2021, 4:21 PM IST

రాష్ట్రంలో ఏడేళ్ల తెరాస పాలన చూస్తే మూడు అడుగులు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న రీతిలో సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డాక నిరుద్యోగుల బాధలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించారు.

నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. దక్షిణ తెలంగాణలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప సాగునీరు సమస్య తీరలేదన్నారు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదిక ఇచ్చిందని... ఇప్పటివరకు ముఖ్యమంత్రి ప్రకటించిన 50 వేల ఉద్యోగుల భర్తీ ఏమైందని ప్రశ్నించారు.

ఈటలపై అక్కసుతోనే..

ఈటల రాజేందర్‌పై అక్కసుతోనే మంత్రి పదవి నుంచి తొలగించారని చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. మిగిలిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసిన తెరాస మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్ భూములపై న్యాయ విచారణ కమిటీ వేసి... దోషులను కఠినంగా శిక్షించాలని చాడ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:KCR: గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్​ నివాళి

ABOUT THE AUTHOR

...view details