ప్రభుత్వ భూములను తెరాస సర్కారు అమ్మాలని నిర్ణయం తీసుకోవడం అనాలోచితమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో భూరికార్డులన్నీ తప్పుల తడకగా ఉన్నాయని... అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం విజృంభణతో దొంగ రికార్డులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు.
Chada venkatreddy: ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదు: చాడ వెంకట్ రెడ్డి - తెలంగాణ ప్రభుత్వ భూముల అమ్మకం నిర్ణయంపై స్పందించిన చాడ వెంకట్ రెడ్డి
ప్రభుత్వ భూముల అమ్మకం నిర్ణయంపై తెరాస సర్కారు పునరాలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదు: చాడ వెంకట్ రెడ్డి
వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చాడ వెంకట్ రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వం వద్ద భూములున్నాయనే భావనతో... వాటిని అమ్ముకోవడం అన్యాయమని తెలిపారు. దీని వల్ల భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతందని అన్నారు. ఇప్పటికైనా సర్కారు భూముల అమ్మకం నిర్ణయంపై పునరాలోచించాలని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి