కరోనా కేసుల వివరాలు సరిగ్గా లేవని సీపీఐ(cpi) రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతుందని పాలకులు ప్రచారం చేస్తున్నారే తప్ప వాస్తవ లెక్కలను ప్రకటించడంలేదని ఆరోపించారు.
cpi: కరోనా కేసుల వాస్తవ లెక్కలను ప్రకటించడంలేదు - చాడ వెంకట్ రెడ్డి వార్తలు
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రచారం చేస్తున్నారే తప్ప, వాస్తవ లెక్కలు చెప్పడం లేదని సీపీఐ(cpi) రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మరణాల సంఖ్య పెరుగుతున్నా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
cpi: కరోనా కేసుల వాస్తవ లెక్కలను ప్రకటించడంలేదు
మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. బ్లాక్, ఎల్లో, వైట్ ఫంగస్ విస్తరిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పల్లెపల్లెకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ టీచర్ల మాదిరిగా చిరుఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.