తెలంగాణ

telangana

ETV Bharat / state

Chada: ప్రాజెక్టులపై కేంద్రం గెజిట్ విడుదల చేయడం దుర్మార్గం: చాడ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాన్ని కేంద్రం ఆసరాగా తీసుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి విమర్శించారు. కృష్ణ, గోదావరి జలాలపై గెజిట్​ విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

By

Published : Jul 21, 2021, 6:53 PM IST

cpi state secretary chada venkat reddy
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి

బ్యాంకులు, ఎల్​ఐసీ ప్రైవేటీకరణ బిల్లులను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 23న కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని కేంద్రం అవకాశంగా తీసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కృష్ణ, గోదావరి జలాలపై గెజిట్​ విడుదల చేయడం రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.

ప్రభుత్వ భూముల అమ్మకంతో భవిష్యత్తు అంధకారం

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుచిత వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జులై 22న రైతు సంఘాలు చేపట్టిన ధర్నాకు పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పేదలకు లబ్ధి చేకూరేలా ఉద్యమాలు ఉద్ధృతం చేయనున్నట్లు తెలిపారు. పోడు భూముల విషయంలోనూ చాలా జిల్లాల్లో అటవీశాఖ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని తెలిపారు. ఆదివాసీలపై క్రిమినల్ కేసులు కూడా పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ఆగస్టు 4 నుంచి 8 వ తేదీ వరకు బాసర నుంచి భద్రాచలం దాకా పోడుయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ, కార్మిక వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 9 వ తేదీన క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆందోళనలు చేపడతామన్నారు.

కృష్ణ జలాల అంశంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. బ్రిజేష్​ కుమార్ ట్రైబ్యునల్ తుదితీర్పు ఇవ్వకపోవడం సమస్యగా మారింది. దీన్ని అదునుగా చూసుకొని కృష్ణ, గోదావరి బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గెజిట్ విడుదల చేయడం దుర్మార్గమైన చర్య. మరోవైపు జల వివాదం నడుస్తుండగా కేంద్రం అదుపులోకి తీసుకోవాలని యత్నించడం రాష్ట్రాల హక్కులను హరించడమే. దీనిపై ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ డిమాండ్​ చేస్తోంది. రాష్ట్రంలో భూముల అమ్మకం అనేది భవిష్యత్తును కాలరాయడమే. ఇలా అమ్ముకుంటూ పోతే మనకు ఇంకా మిగిలేది శూన్యం. రాష్ట్రంలో ఉన్న అసైన్డ్​, పోడు భూముల సమస్యను పరిష్కరించలేదు. ఒకవైపు గిరిజనులపై దాడులు చేస్తున్నారు. దీనిపై సీపీఐ తరఫున పోడుయాత్ర చేయనున్నాం. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోంది. దీన్ని ఖండిస్తూ వచ్చేనెల 9వ తేదీన జాతీయస్థాయిలో నిరసన చేపట్టనున్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదు. సీఎం కేసీఆర్​ కేవలం 55 వేలే ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు. - చాడ వెంకట్​ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇదీ చూడండి:

చమురు ధరలు తగ్గించాలని వామపక్షాల ధర్నా

'పోడు సాగు దారులపై దాడులు తగవు'

Chada: 'ప్రభుత్వ భూముల వేలం నిలిపివేయండి.. లేకుంటే అడ్డుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details