తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు పరిహారం ఇవ్వాలి: చాడ వెంకట్​ రెడ్డి - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి లేటెస్ట్​ వార్తలు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి డిమాండ్​ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టంపై సర్వే చేయించి ఎకరానికి రూ. 25వేల నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

cpi
చాడ వెంకట్​ రెడ్డి

By

Published : Apr 21, 2021, 1:55 PM IST

రాష్ట్రవ్యాప్తంగా అకాల వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నల్గొండ జిల్లాలో వడగండ్లు పడడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.

ఒకవైపు బోరు బావులలో నీటి మట్టం తగ్గిపోయి పంటల నష్టం సంభవించగా.. మరోవైపు వడగండ్ల వాన రైతు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టంపై సర్వే చేయించి ఎకరానికి రూ. 25వేల నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:'హనుమంతుడు జన్మించింది అంజనాద్రిలోనే'

ABOUT THE AUTHOR

...view details