రేపటి నుంచి రెండురోజుల పాటు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అతుల్ కుమార్ అంజన్ హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం జరిగే సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొంటారని వెల్లడించారు. అదేరోజు సాయంత్రం పబ్లిక్ గార్డెన్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జరిగే ఇండియన్ కమ్యూనిజం, సోషల్ జస్టిస్ సెమినార్‌కు రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈనెల 25న మఖ్దుం భవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఆర్టికల్-370 రద్దు, కశ్మీర్ పరిణామాలు అనే అంశంపై రాజా ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు - chada
శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మఖ్దుం భవన్‌లో జరగనున్నాయి. ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అతుల్ కుమార్ అంజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.
రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు