తెలంగాణ

telangana

ETV Bharat / state

'జంట నగరాల్లో నాళాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయి' - చాడ వెంకట్ రెడ్డి వార్తలు

సరూర్​నగర్ చెరువు ప్రాంతాన్ని చాడ వెంకట్ రెడ్డి పరిశీలించారు. మృతుడు నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సూచించారు. జంటనగరాల్లో నాళాలు, చెరువులు కబ్జాకు గురి అయ్యాయని... వారిపై చర్యలు తీసుకోవాలని చాడ అన్నారు.

cpi-secretary-chada-venkat-reddy-serious-on-government-about-floods-in-hyderabad
'జంట నగరాల్లో నాళాలు, చెరువులు కబ్జాలకు గురి అయ్యాయి'

By

Published : Sep 22, 2020, 7:39 PM IST

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ నాళాలో పడి చనిపోయిన నవీన్‌ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సరూర్ నగర్ చెరువు ప్రాంతాన్నీ ఆయన పరిశీలించారు.

'జంట నగరాల్లో నాళాలు, చెరువులు కబ్జాలకు గురి అయ్యాయి'

జంట నగరాల్లో మనిషికి రక్షణలేని పరిస్థితి ఏర్పడిందని చాడ ఆరోపించారు. నాళాలు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం వల్లే ఎక్కడికక్కడ వరదనీరు నిలిచిపోతోందన్నారు. ప్రభుత్వం సర్వే చేయించి కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే జంటనగరాలు నరక కూపాలుగా మారిపోయే ప్రమాదముందన్నారు.

ఇదీ చూడండి:కేటీఆర్​ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్​

ABOUT THE AUTHOR

...view details