జూడాలు సమ్మెకు దిగడం వల్ల రోగులు ఇబ్బంది పడతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆక్సిజన్, పడకల కొరతతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. జూడాల సమ్మెతో పరిస్థితి మరింత దిగజారుతుందని అన్నారు. కరోనా మూలంగా పేదవర్గాలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
JUDAs strike: జూడాల సమస్యలు పరిష్కరించాలి: చాడ వెంకట్ రెడ్డి - చాడా వెంకట్ రెడ్డి వార్తలు
తెలంగాణలో ఆక్సిజన్, పడకల కొరతతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. జూడాలు సమ్మెకు దిగడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. వెంటనే జూడాల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
జూాడాల సమస్యలు పరిష్కరించాలి: చాడ వెంకట్ రెడ్డి
ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనేక లేఖలు రాసినా స్పందించలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా జూడాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు..
ఇదీ చదవండి:KTR: సమ్మెకు ఇది సరైన సమయం కాదు