ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. సింగరేణి బొగ్గుగనులని సైతం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందన్నారు. ఆర్ధిక వ్యవస్థకు ఉపయోగపడే సింగరేణిని విదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటూనే విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, బోస్, నరసింహా, ఏఐటీయూసీ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కేంద్రం కుట్ర: నారాయణ - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజా వార్తలు
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గనుల ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని స్పష్టం చేయాలన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది: నారాయణ
ముఖ్యమంత్రి కేసీఆర్ బొగ్గు గనుల ప్రైవేటీకరణపై స్పందించాలని డిమాండ్ చేశారు. కరోనాను రానివ్వనని చెప్పిన కేసీఆర్ వెళ్లి ఫామ్ హౌజ్‌లో పడుకున్నాడని విమర్శించారు. ప్రజలు కరోనా బాధలో ఉంటే మోదీ కార్పొరేట్ భజన చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకే ప్రతిష్ఠాత్మకమైన సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇదీ చూడండి:గ్రేటర్లో విజృంభణ.. రికార్డు స్థాయిలో 1658 కేసులు