తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రంప్​ పర్యటనకు నిరసనగా అమెరికన్​ కాన్సులేట్​ కార్యాలయ ముట్టడి

భారత్​లో ట్రంప్​ పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ కార్యకర్తలు హైదరాబాద్​ బేగంపేటలోని అమెరికన్​ కాన్సులేట్​ కార్యాలయ ముట్టడికి యత్నించారు. చాడ వెంకటరెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

CPI Protest in front of Us Consulate in hyderabad begumpet
ట్రంప్​ పర్యటనకు నిరసనగా అమెరికన్​ కాన్సులేట్​ కార్యాలయ ముట్టడి

By

Published : Feb 25, 2020, 3:13 PM IST

భారత్​పై అమెరికా పెత్తనం చెలాయించేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని సీపీఐ నాయకులు ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బేగంపేటలోని అమెరికన్​ కాన్సులేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ట్రంప్​ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.​

ఈ ఆందోళన నేపథ్యంలో.. అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన 15 మంది సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్​కు తరలించారు. రసూల్​పురా చౌరస్తా దగ్గర సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ట్రంప్​ పర్యటనకు నిరసనగా అమెరికన్​ కాన్సులేట్​ కార్యాలయ ముట్టడి

ఇవీచూడండి:అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందంలో సవాళ్లెన్నో..?

ABOUT THE AUTHOR

...view details