ట్యాంక్‌బండ్‌పై పోలీసుల లాఠీ ఛార్జీని నిరసిస్తూ... సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... హిమాయత్ నగర్ కూడలి వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతటి అరాచకమం లేదని మాజీ ఎంపీ అజీజ్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
'బంగారు తెలంగాణ అంటే రబ్బర్ బుల్లెట్లు, లాఠీఛార్జీలా?' - TSRTC Employees Million March
బంగారు తెలంగాణ అంటే రబ్బర్ బుల్లెట్లు, లాఠీ ఛార్జీలా అంటూ సీపీఐ నేత, మాజీ ఎంపీ అజీజ్ పాషా ప్రశ్నించారు. మిలియన్‌మార్చ్‌లో పోలీసుల తీరును నిరసిస్తూ సీపీఐ ఆందోళనకు దిగింది.

బంగారు తెలంగాణ అంటే... రబ్బర్ బుల్లెట్లు, లాఠీ ఛార్జీలా...?
బంగారు తెలంగాణ అంటే... రబ్బర్ బుల్లెట్లు, లాఠీ ఛార్జీలా...?