హైదరాబాద్లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్షాలు గతంలోనే కరోనా టెస్టులు తక్కువ సంఖ్యలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నా... ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.
కరోనాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: చాడ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. తక్షణమే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి: చాడ
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో చాడ పాల్గొన్నారు. ఎట్టకేలకు 50 వేలు కొవిడ్-19 పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల