కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. కేంద్రం వైఫల్యాలకు వ్యతిరేకంగా... దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ధర్నా చేపట్టారు. జీఎస్టీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ ప్రారంభమైన కొత్తలో రాష్ట్రాలకు కష్టం వస్తే కొంత కాలం పాటు వాటిని కేంద్రమే భరిస్తుందని చెప్పారని గుర్తు చేశారు. చట్టంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని నారాయణ వెల్లడించారు.
రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోంది: నారాయణ - హిమాయత్‌నగర్ వద్ద ధర్నా వార్తలు
కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. రాష్ట్రాలకు చెందిన జీఎస్టీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
![రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోంది: నారాయణ cpi-party-dharna-against-central-government-at-himayath-nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8794951-thumbnail-3x2-cpi.jpg)
రాష్ట్రాల హక్కులను కేంద్రప్రభుత్వం హరిస్తోంది: నారాయణ
రాష్ట్రాల హక్కులను కేంద్రప్రభుత్వం హరిస్తోంది: నారాయణ