తెలంగాణ

telangana

ETV Bharat / state

'మూణ్నెళ్లుగా కాశీంను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు' - narayana Denied police raid on professor kashim's house

నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంటిపై పోలీసుల సోదాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. విప్లవ భావజాలలతో ప్రజలను చైతన్యం చేయాలని ప్రయత్నిస్తున్న కాశీంను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpi national secretary narayana Denied police raid on professor kashim's house
'మూణ్నెళ్లుగా కాశీంను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు'

By

Published : Jan 18, 2020, 10:00 AM IST

'మూణ్నెళ్లుగా కాశీంను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు'

నిజాం కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కాశీం ఇంటిపైన పోలీసులు దాడులు చేసి, హింసిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇంట్లో సోదాలు నిర్వహించడమేంటనీ, ఆయనేమీ సాయుధ పోరాటం చేసినవాడు కాదన్నారు. కేవలం విప్లవ భావజాలంతో ప్రజలను చైతన్యం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.

కళాశాలలో కాశీం మంచి పేరు సంపాదించుకున్నాడని నారాయణ అన్నారు. మూణ్నెళ్లుగా... అతనిపై కేసులు పెట్టి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details