తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహణ నిషేధించాలి: సీపీఐ - hyderabad latest news

విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ వెంటనే నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌ పేరిట ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. పట్టణాల్లో ఉండే వారికి మాత్రమే సదుపాయలున్నాయని.. గ్రామీణ విద్యార్థులకు ఉండవన్నారు.

cpi national secretary narayana
విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహణ నిషేధించాలి: సీపీఐ

By

Published : Jul 2, 2020, 4:47 AM IST

విద్యార్థులకు ఆన్​లైన్ క్లాసులు నిర్వహణ పేరుతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అందువల్ల వెంటనే ఆన్​లైన్​ తరగతులు నిషేధించాలని డిమాండ్ చేశారు.

పట్టణాల్లో ఉండే విద్యార్థులకు మాత్రమే అంతర్జాల తరగతులకు మౌలిక సదుపాయలున్నాయని.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉండకపోవడం వల్ల విద్యార్థుల మధ్య చదువులో వ్యత్యాసాలు వస్తాయన్నారు. ఇది విద్యార్థుల మధ్య అసమానతలకు దారితీస్తుందని తెలిపారు.

విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహణ నిషేధించాలి: సీపీఐ

ఇదీ చూడండి:నేటి నుంచి ప్రైవేటు మెడికల్​ కాలేజీల్లో కరోనా చికిత్స

ABOUT THE AUTHOR

...view details