విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కంపెనీని వెంటనే రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని పేర్కొన్నారు. లీకైన వాయువు భోపాల్ గ్యాస్ తరహా విషవాయువుగా పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులను సైతం సస్పెండ్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం చనిపోయిన వారికి 25లక్షలు.. క్షత్రగాత్రులకు 15వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
మరోవైపు దేశంలో పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని కేంద్రంపై ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ కార్డులు లేకున్నా ప్రతి వ్యక్తికి రూ.10వేల నగదు, 20కిలోల బియ్యం ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో భౌతిక దూరం పాటించాలన్న మోదీ ప్రభుత్వం... మద్యం దుకాణాలు తెరిచి నిబంధనలను తానే తుంగలో తొక్కారని అగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమ సొమ్మంతా మద్యం తాగేందుకేనా ? : చాడ