D Raja on BJP : ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కులేకుండా చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ఎన్నికల్లో భాజపా... డబ్బు పవర్‌ను ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర విధానాలతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ హక్కులను కోల్పోతున్నాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందన్నారు. జాతీయ స్థాయిలో బ్యాంక్ ఉద్యోగులు వచ్చే నెలలో సమ్మె చేస్తున్నారని... ఆ ఉద్యమానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం భాజపా తీరుపై ఆలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.