తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్‌ మహిళా దర్బార్ ఎందుకుపెడుతున్నారు?: నారాయణ - హైదరాబాద్ తాజా వార్తలు

Cpi Narayana Comment On Governor: గవర్నర్‌ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మహిళా దర్బార్‌ అసలెందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

నారాయణ
నారాయణ

By

Published : Jun 9, 2022, 2:13 PM IST

Cpi Narayana Comment On Governor: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తలపెట్టిన మహిళా దర్బార్‌ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా దర్బార్‌ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓవైపు భాజపా రాజకీయ దాడిని పెంచిందని.. మరోవైపు గవర్నర్‌ పాత్ర అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉందన్నారు. మహిళా దర్బార్‌ను రద్దు చేయాలని పేర్కొన్నారు. మరోవైపు తెరాస ప్రభుత్వంపై విధానపరంగా సీపీఐ పోరాడుతోందని చెప్పారు. మైనర్లను పబ్‌లోకి అనుమతించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. పబ్‌ను సీజ్‌ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్‌ చేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

గవర్నర్‌ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారు

"తెలంగాణ గవర్నర్‌ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారు. గవర్నర్ తమ పరిధిని దాటి ప్రజా దర్బార్​ను నిర్వహించి రాజకీయ కార్యకలాపాలకు నాంది పలుకుతుంది. ఓవైపు భాజపా రాజకీయ దాడిని పెంచింది. మరోవైపు గవర్నర్‌ పాత్ర అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పబ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తుంది." - నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details