తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ కంటే పువ్వాడ గొప్పవాడనే విషయం నాకు తెలియదు' - CPI NARAYANA UPDATES

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీపీఐ నారాయణ మరోసారి పువ్వాడపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

'కేసీఆర్​ కంటే పువ్వాడ గొప్పవాడనే విషయం నాకు తెలియదు'
'కేసీఆర్​ కంటే పువ్వాడ గొప్పవాడనే విషయం నాకు తెలియదు'

By

Published : Dec 3, 2020, 4:19 PM IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీపీఐ నారాయణ మరోసారి పువ్వాడపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటే మంత్రి అజయ్‌కుమార్‌ గొప్పవాడనే విషయం తనకు తెలియదని ఎద్దేవా చేశారు.

మంత్రి తనపై చేస్తున్న అవినీతి ఆరోపణల వల్ల ఎలాంటి నష్టం లేదని... అది తనకే మేలు చేస్తాయన్నారు. పువ్వాడ... ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నట్లు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. సీపీఐలో సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని... ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడి నిర్ణయాలే ఉంటాయన్నారు. మూడు పార్టీలు మారిన అజయ్‌కుమార్‌కు పువ్వాడ నాగేశ్వరరావు పేరు వాడుకునే అర్హత లేదన్నారు.

మంత్రి పువ్వాడ నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. నాపై ఎంత అవినీతి ఆరోణలు చేస్తే నాకు అంత ఉపయోగం తప్ప... నష్టం లేదని తెలుసుకోండి. కేసీఆర్ కంటే గొప్పవాడివా? నాకు ఇంత వరకు తెలియదు. మీరు దయచేసి పువ్వాడ నాగేశ్వరరావు, కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్పుకోకండి.

--- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

'కేసీఆర్​ కంటే పువ్వాడ గొప్పవాడనే విషయం నాకు తెలియదు'

ఇవీచూడండి:సురేందర్​ బ్యాంకు లాకర్​లో భారీగా నగదు, బంగారం

ABOUT THE AUTHOR

...view details