నయీం కేసు తవ్వేకొద్ది అక్రమాస్తులు బయటపడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. కేవలం ఆస్తులు పట్టుకోవడంలోనే ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని మండిపడ్డారు. నయీం ప్రభుత్వ పాలసీలను ఉపయోగించుకుని, నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడని స్పష్టం చేశారు. నయీం వెనకున్న రాజకీయ, పోలీసు నేతలను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. నయీం వ్యక్తి కాదు... వ్యవస్థ లోపాల్లోంచి పుట్టిన విషబిందువని తెలిపారు.
నయీం... వ్యవస్థ లోపాల్లోంచి పుట్టిన విషబిందువు
ప్రభుత్వం రౌడీషీటర్ నయీం ఆస్తులపై ఆసక్తి చూపుతుంది తప్ప... అతని వెనకున్న వ్యక్తులపై ఆరా తీయట్లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.
నయీం... వ్యవస్థ లోపాల్లోంచి పుట్టిన విషబిందువు