తెలంగాణ

telangana

CPI NARAYANA: ప్రగతిభవన్​ కోటలు బద్ధలవుతాయ్​!

By

Published : Jun 18, 2021, 6:22 PM IST

సీఎం కేసీఆర్​ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. ప్రగతిభవన్​ కోటలు బద్ధలవుతాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. పెద్ద పెద్ద గేట్లతో ఇనుప కంచెలను ఏర్పాటు చేసేందుకు ప్రగతి భవన్ ఏమైనా నిజాం నవాబ్​ కోటనా అంటూ దుయ్యబట్టారు.

కేసీఆర్​ కట్టుకున్న ప్రగతిభవన్​ కోటలు బద్ధలవుతాయ్​!
కేసీఆర్​ కట్టుకున్న ప్రగతిభవన్​ కోటలు బద్ధలవుతాయ్​!

ప్రగతిభవన్‌ ఏమైనా నిజాం నవాబ్‌ కోటనా అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్​పై మండిపడ్డారు. తన కార్యాలయానికి కేసీఆర్‌ పెద్ద పెద్ద గేట్లతో ఇనుప కంచెలను ఏర్పాటు చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. నిజాం కోట తరహాలో నయా కోట నిర్మించారా అంటూ దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన సీఎం కేసీఆర్‌ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఫామ్‌హౌజ్‌లో పడుకోవడం, ప్రగతిభవన్‌కు ఇనుప కంచెలు వేసుకోవడమేంటని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను నమ్మాలని హితవు పలికారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. కోటలు బద్ధలవుతాయని హెచ్చరించారు.

ఇదీ చూడండి: Ts Lockdown: రాష్ట్రంలో లాక్​డౌన్ ఇక ఉండదా? అయితే వాట్ నెక్స్ట్?

ABOUT THE AUTHOR

...view details