ఎన్‌ఆర్‌పీకి వ్యతిరేకంగా బిహార్‌లో జేఎన్‌యూ మాజీ నేత కన్హయ్య కుమార్ చేసిన పోరాటానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తలొగ్గారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్‌ఆర్‌పీకి వ్యతిరేకంగా కన్హయ్య కుమార్ నెలరోజుల పాటు చేసిన ప్రచారంలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. జనాదరణను చూసిన నితీశ్‌కుమార్... తమ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయనే భయంతో ఎన్‌ఆర్‌పీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేశారన్నారు. రేపు పట్నాలో పదిలక్షల మందితో బహిరంగ సభ జరగబోతుందని నారాయణ తెలిపారు.
'కన్హయ్య కుమార్ పోరాటానికి బిహార్ సీఎం తలొగ్గారు' - NPR latest news
బిహార్‌లో ఎన్‌ఆర్‌పీకి వ్యతిరేకంగా జేఎన్‌యూ మాజీ నేత కన్హయ్య కుమార్ చేసిన పోరాటానికి అక్కడి ముఖ్యమంత్రి తలొగ్గారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.
CPI national Secretary Narayana latest news