ఈటల రాజేందర్‌పై వేటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతమేనా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పరిధిలో విచారణ కన్నా.. ఉన్నత స్థాయి విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈటలపై వేటుకు.. ప్రస్తుతం లభించిన ఆధారాలకు సరితూగడం లేదన్నారు.
'ఈటలపై వేటు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతమేనా' - telangana latest news
ఈటల రాజేందర్ విషయంలో అనేక ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాల్సి వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈటలపై వేటు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతమేనా అని అనుమానం వ్యక్తం చేశారు.
cpi narayana responded on minister eetala issue
ఈటలపై వస్తోన్న ఆరోపణలపై ఆయన తలెత్తుకు తిరుగుతాడా అనే స్వీయ మానసిక ధోరణి కనిపించడం లేదా అని నారాయణ ప్రశ్నించారు. సీఎం నిర్ణయంతో మంత్రివర్గంపై ప్రజలకు సందేహాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈటల విషయంలో అనేక ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఈటల బాణం గురిపెట్టే ఉంటుందేమో చూడాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై సీఎస్‌కు మెదక్ కలెక్టర్ నివేదిక