CPI Narayana Reaction on Alliance in Telangana : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల పొత్తు విషయం మధ్య ఉత్కంఠ సాగుతూనే ఉంది. సీట్ల విషయంలో పలుమార్లు కాంగ్రెస్ నాయకులు, సీపీఐ నాయకులు భేటీ అయినా.. స్పష్టత రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలకు చెరో రెండు ఎమ్మెల్యే సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. వారి పొత్తు విషయంలో కూడా మరింతగా ప్రచారం అవుతుంది. తాజాగా ఈ అంశంలో స్పష్టత వచ్చిందని.. కాంగ్రెస్‌తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI National Secretary Narayana) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న.. కమ్యూనిస్టులకు చెరో రెండు సీట్లు అన్న విషయంలో ఆయన స్పందించారు. ఆ విషయం ప్రస్తుతానికి ప్రచారం మాత్రమేనని.. కాంగ్రెస్ నుంచి అలాంటి ప్రతిపాదన తమకి ఏమి రాలేదని స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో సీట్ల పంపిణి విషయం స్పష్టత వస్తుందని చెప్పారు.
CPI Narayana Claritry on alliance With Congress : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమిలో ఉన్నామని.. రాష్ట్రంలో కూడా ఆ తరహా రాజకీయ అవగాహనతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. పొత్తు సీట్ల విషయంలో తొందరేమి లేదని.. నామినేషన్లు వేసే వరకు సమయం ఉందని అన్నారు. సీట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.
"జాతీయ స్థాయిలో వామపక్షాలు ఇండియా కూటమి ఉన్నవి. తెలంగాణలో కూడా వాటితో కలిసి ఉండాలని రాజకీయ అవగాహన కుదిరింది. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మా ప్రతిపాదనలన్ని వారికి చెప్పాం. వారు నాయకులందరూ చర్చించారు. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌కు వస్తోంది. రెండు రోజుల్లో సీట్ల పంపిణి కూడా జరుగుతుంది. దాని ప్రకారం మేము ఎన్నికల్లో పాల్గొంటాం. ఛత్తీస్‌గఢ్ దాదాపు 45 సీట్లలో పోటీ చేస్తున్నాం. మిగిలిన ఐదు రాష్ట్రల్లో కూడా మా ఎత్తుగడ వేస్తున్నాం." - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి